Movies | Music | Masti Close Aha Ad
Movies | Music | Music



NTR's Bigg Boss 1st Episode Review

‘బిగ్’ న్యూసే కానీ...వాళ్లను చూస్తే సారీ 'బాస్'

బిగ్ బాస్ షో తెలుగులో వస్తోందటగా...అనే గాసిప్ నుంచి...యస్...ఎన్టీఆర్...బిగ్ బాస్ షో మొదటి రోజు డాన్స్ కుమ్మేసాడు కదా అనే న్యూస్ దాకా వచ్చేసాం. ఈ గ్యాప్ లో ఈ షో గురించి చాలా తెలుసుకున్నాం...తెగ మాట్లాడుకున్నాం...ఎంతో కొంత ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నాం. ఆ అంచనాలని ఈ షో రీచ్ అయ్యిందా? అంతకు మించి అన్నట్లు ఉందా? లేక ఇంతేనా అనిపించిందా?

గత కొద్ది రోజులుగా 'బిగ్ బాస్' షో తెలుగులో వస్తోందనే విషయానికి మీడియా ఓ రేంజిలో హైప్ ఇస్తోంది. అందుకు ఏకైక కారణం..తెలుగు జనాల్లో బిగ్ బాస్ షో కు ప్రత్యేక క్రేజ్ ఉండటం కాదు..ఎన్టీఆర్ ఆ షోని నిర్వహించటానికి ఓకే చేసారనే. అయితే ఈ షో మొదటి రోజు ప్రారంభమయ్యేదాకా (అంటే సినిమా భాషలో చెప్పాలంటే ధియోటర్ దాకా తీసుకొచ్చేలాంటి ప్రయాణం) వరకూ జనాలకి టీవీ సెట్ల దగ్గర కూర్చోబెట్టేవరకూ మాత్రమే ఎన్టీఆర్ పాత్ర కీలకం. ఈ విషయంలో ఎన్టీఆర్ పూర్తిగా సక్సెస్ అయ్యారు. అయితే ముందుంది అసలైన పరీక్షలాంటి పండగ....షో ప్రారంభం అయిన తర్వాత అందులో పాల్గొనే కాంటెస్టెంట్ చేసే ఛేష్టలే ఈ షోని రాబోయే రోజుల్లో నడిపించే ఇంధనం..అవే టీఆర్పీలకు ప్రధానం.

నిజానికి ఎన్టీఆర్ ని సీన్ లోకి తేవటం దాకా పోగ్రామ్ నిర్వాకులు సక్సెస్ అయ్యారు. అయితే ఈ పోగ్రాంలో పాల్గొన్న కాంటెస్టెంట్ మాత్రం ఏ మాత్రం ఆసక్తి కలిగించేవారిని మాత్రం తేలేకపోయారు. బిగ్ బాస్ హౌస్ అంటే పలు రంగాల నుంచి వచ్చి, కాస్త సహజంగా బిహేవ్ చేసే వ్యక్తులతో అంతా ఓ వింత వాతావరణం కనిపిస్తుంది. అదే హిందీలో సక్సెస్ అయిన ఫార్ములా. ప్రపంచవ్యాప్తంగా జనాలకు కిక్ ఇచ్చిన ఈ షోకు మూలమైన బిగ్ బ్రదర్ లోనూ కీలక అంశం. అయితే మన తెలుగులో మాత్రం ఎందుకునో ఆ వాతావరణం మిస్సైందనిపించింది.

అందుకు కారణం కంటిస్టెంట్స్ అందరు సినిమావాళ్ళే (అందులోనూ వాళ్లలో ఎక్కువమంది నటులే ఉండటం) కావటం వలన కావచ్చు. దీంతో బిగ్ బాస్ హౌస్ లో వాళ్లంతా ఏదో స్క్రిప్టు ప్రకారం ఓ డ్రామా కోసమో లేదా ఓ షార్ట్ ఫిలిం కోసమో నటిస్తున్నట్లు అనిపించింది తప్ప ఎక్కడా సహజత్వం కనపడటంలేదు. కామెడీ కోసం ధన్ రాజ్ ని, సంపూర్ణేష్ బాబుని..ఇంకొకరని సంగీతానికి, వేరొకరని ఐటం సాంగ్ ల కోసం..మరొకరను షోని రివ్యూ చేయటానికి మరొకరిని తీసుకున్నట్లు ఉంది. అంటే ఓ సినిమాలా దీన్ని ప్లాన్ చేసారనిపిస్తోంది. రియాలటీ షోలో రియాలటీ మిస్సైంది. అయితే మొదటి రెండు మూడు రోజుల్లోనే పూర్తిగా అంచనా వేయలేం కానీ ఖచ్చితంగా కాంటెస్టెంట్ మాత్రం నిరాశపరిచారనే చెప్పాలి.

తమిళంలోనూ కొంచెం అటూ ఇటూలో ఇదే సమస్య వచ్చింది. కమల్ వంటి జాతీయ స్దాయి నటుడు ఈ షోని హోస్ట్ చేస్తున్నా...షో లో కిక్ అనేది ఎక్కడా లేకుండా పోయింది. వెండితెరపై తన నటనలో సహజత్వం చూపే కమల్ నడిపే ఈ షో చాలా కృత్రిమంగా ఉందనే విమర్శలు వచ్చాయి..వస్తున్నాయి. దానికి తోడు షోలో ఉత్సాహం కొరవడిందని,పెద్దగా ఇంట్రస్ట్ లేదని అంటున్నారు. కమల్ ఎంత ట్రై చేసినా, ఎన్ని వివాదాలు తీసుకువచ్చినా ఈ షో క్లిక్ అయ్యేటట్లు కనపడటం లేదు.

ఇక్కడ మరోవిషయం మనం గుర్తు చేసుకోవాలి. బిగ్ బాస్ హిందీ వెర్షన్ కు అయితే ఓ ప్లస్ ఉంది. దేశం మొత్తం నుంచి వివాదాస్పద వ్యక్తులను కాంటెస్టెంట్ గా తీసుకురావచ్చు. అధే రీజనల్ లాంగ్వేజ్ ఛానెల్స్ కు వచ్చేసరికి..పరిధి తగ్గిపోతోంది. వివాదాస్పద వ్యక్తులు అనుకున్నంతమంది దొరకరు. దొరికినా వాళ్లంతా ఈ టీవీషోకు రావటానికి ఇష్టపడకపోవచ్చు. అదే తెలుగుకూ,తమిళం కు సమస్య వచ్చి ఉండవచ్చు. లేకపోతే మొత్తం సినిమావాళ్లతో షోని నింపాల్సిన అవసరం ఏముంది.

ఫైనల్ గా ..బిగ్‌ బాస్‌ షోలో ప్రేక్షకులుకు కిక్ అంశం ఏమిటీ అంటే గొడవలు..వివాదాలు. అందుకోసం సాధారణంగా బిగ్‌ బాస్‌లో హౌస్‌ లో ఉండబోయే కంటిస్టెంట్స్ కూర్పు చాలా తెలివిగా గొడవలకు ఆస్కారం విధంగా చేస్తారు. కావాలనే వివాదాస్పదులను, ఎప్పుడు ఎవరో ఒకరితో ఏదో గొడవపెట్టుకుందామనుకునేవాళ్లను వెతుకుతారు. అప్పుడు షో చూసేవాళ్లు పండుగ చేసుకుంటారని పోగ్రామ్ డిజైన్ చేసేవాళ్లకి తెలుసు. తెలుగులో అదీ లోపించిందనిపించింది. చూడాలి...మనం అంచనా తప్పేలా వారు కొట్టుకుంటారేమో...బహిరంగంగా లవ్ స్టోరీలు నడిపేస్తారేమో, శృంగారం ఒలకపోసేస్తారేమో. టీఆర్పీలు పెంచేస్తారేమో

 Other Links: Movie Info   Galleries   Functions   Trailers/Videos